న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ‘ప్రజా పోల్ ఎనలిటిక్స్ (పీపీఏ)’ సంస్థ ఎగ్జిట్‌పోల్ అంచనాలకు తగినట్టు వచ్చాయి. బీజేపీకి 91 సీట్లు రావొచ్చని, కాంగ్రెస్ 5 సీట్లకు పరిమితం కాబోతుందని అత్యంత కచ్చితత్వంతో ఈ సర్వే సంస్థ మంగళవారం ఎగ్జిట్ పోల్‌లో అంచనా వేసింది. దీనికి తగ్గట్టే తాజా ఫలితాల్లో బీజేపీకి 89 సీట్లు, కాంగ్రెస్‌కు 6 సీట్లు రావడం గమనార్హం.
ఎన్డీఏ, ఇండియా కూటమికి వచ్చే సీట్లను కూడా పీపీఏ సంస్థ కచ్చితత్వంతో అంచనా వేసినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 2017 యూపీ ఎన్నికల్లో ఈ సంస్థ అంచనాలు నిజమైనట్లు సమాచారం.