న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేండ్లు పొడిగించింది. దేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగించడం, ఉగ్రవాదాన్ని పురిగొల్పడం వంటి చర్యలకు ఈ సంస్థ పాల్పడినందుకు ఈ చర్య తీసుకుంది. దీనికి సంబంధించిన ఆదేశాలను ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం సిమిపై 2001లో మొదటిసారి నిషేధం విధించింది. అప్పటి నుంచి ఐదేండ్లకొకసారి నిషేధాన్ని పొడిగిస్తున్నారు.