హైదరాబాద్, ఫిబ్రవరి 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమ స్తే తెలంగాణ): డీప్‌ఫేక్ వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో టెక్ దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. డీప్‌ఫేక్‌ల ను కట్టడి చేయడానికి వాట్సాప్‌లో ప్రత్యేక ఫ్యాక్ట్ చెక్ హెల్ప్‌లైన్‌ను తీసుకురానున్నట్టు పేర్కొంది. కృత్రిమ మే ధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) ఆధారంగా పనిచేయనున్న ఈ చాట్‌బోట్ వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్నట్టు వెల్లడించింది.
ఈ మేరకు ‘మిస్ఇన్ఫర్మేషన్ కంబాట్ అ లయన్స్’ తో భాగస్వా మ్యం అవుతున్నట్లు వివరించింది. ఎంసీఏ, దాని అనుబంధ స్వతంత్ర ఫ్యాక్ట్-చెకర్లు, పరిశోధన సంస్థలు వైరలవుతున్న తప్పుడు సమాచారాన్ని, ముఖ్యంగా డీప్‌ఫేక్‌లను గుర్తిస్తాయని మెటా వెల్లడించింది. ఇంగ్లిష్తో పాటు హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ సేవలను ప్రారంభించనున్నట్టు తెలిపింది.