ఓ బాలుడు సదరా కోసం చేసిన పని మరో బాలుడి ప్రాణం తీసింది. బాలుడి పురీషనాళంలో అతడి స్నేహితుడు ఎయిర్‌కంప్రెసర్ చొప్పించడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అనంతరం ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని మెహ్సానాలో జరిగింది.
కడి తాలూకాలోని అలోక్ ఇండస్ట్రీస్‌లో పనిచేస్తున్న ఓ బాలుడు తన తోటి వర్కర్ (16 ఏళ్ల బాలుడు)ను ఆటపట్టించాలనుకున్నాడు. చెక్కలను తొలగించేందుకు ఉపయోగించే ఎయిర్ సక్షన్ పంప్‌ను బాలుడి పురీషనాళంలోకి చొప్పించాడు. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని నిందితుడు యజమానికి చెప్పగా, అతడు వెళ్లిచూసేసరికి బాలుడు చనిపోయి ఉన్నాడు. సరదా కోసమే తాను ఈ పనిచేశానని, బాలుడిని చంపాలనుకోలేదని నిందితుడు చెప్పాడు. కాగా, బాలుడి మృతికి కారణమైన మరో బాలుడిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు.