థానే: మహారాష్ట్రలోని దహి హండి ఉత్సవాలు ఒక చారిత్రక క్షణానికి సాక్ష్యంగా నిలిచాయి. జోగేశ్వరికి చెందిన కొంకణ్ నగర్ గోవింద పాఠక్ 10 అంచెల మానవ పిరమిడ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచ రికార్డ్‌ను సృష్టించారు.
థానేలో నిర్వహించిన దహి హండీ పండుగ సందర్భంగా ఈ ఫీట్‌ను సాధించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నైక్ అతిథిగా విచ్చేశారు. ఆహుతుల చప్పట్ల మధ్య పాఠక్ 10 అంతస్థుల మానవ పిరమిడ్‌ను రూపొందించారు. ఈ ఘనతకు అద్భుతమైన బలం, సమతుల్యత, సమన్వయం అవసరం. పాఠక్ బృందాన్ని మంత్రి అభినందించారు.