కర్నూల్ : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌కు చెందిన భరత్ తమ్మినేని(36) పర్వతారోహణలో మంగళవారం అరుదైన రికార్డ్ సృష్టించారు. ప్రపంచంలోని 14 ఎత్తయిన పర్వతాల్లో తొమ్మిదింటిని అధిరోహించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. ఆరో ఎత్తయిన పర్వతం చో ఒయూను(8,188 మీటర్లు) తాజాగా అధిరోహించడం ద్వారా ఆయన ఈ ఘనత సాధించారని అతడి సన్నిహితులు తెలిపారు.
2017లో భరత్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో మిగతా ఏడు ఎత్తయిన శిఖరాలను అధిరోహించారు. ప్రతికూల వాతావరణం, భారీ హిమపాతం ఉన్నా షెర్పాల సాయం లేకుండా చో ఒయూ శిఖరాన్ని అధిరోహించానని భరత్ తెలిపారు.