Thalapathy Vijay | చెన్నై, ఫిబ్రవరి 2: తమిళ నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేశారు. ‘తమిళ వెట్రి కళగం’ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. తమిళ వెట్రి కళగం అంటే తమిళనాడు విజయ పార్టీ అని అర్థం. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వెల్లడించారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, అవినీతి రాజ్యమేలుతున్నదని వ్యాఖ్యానించారు. కుల, మతాలతో రాజకీయాలు జరుగుతున్నాయని తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేద్దామని అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసినట్టు వివరించారు. పార్టీ జెండా, అజెండాను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.