Tesla Layoffs | టెస్లాలో కొనసాగుతున్న కొలువుల కోత : పలువురు ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు
Tesla Layoffs : టెస్లాలో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. గత వారం కంపెనీలో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ తొలగించగా వందలాది ఇతర ఉద్యోగులపై కూడా వేటు పడనుంది.
Tesla Layoffs : టెస్లాలో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. గత వారం కంపెనీలో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ తొలగించగా వందలాది ఇతర ఉద్యోగులపై కూడా వేటు పడనుంది. ఇక వారాంతంలో పలువురు ఉద్యోగులకు కంపెనీ లేఆఫ్ నోటీసులు పంపిందని ఓ వార్తా సంస్ధ వెల్లడించింది. పలువురు ఉద్యోగులు తమకు అందిన ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను లింక్డిన్లో షేర్ చేయడంతో ఈ వివరాలు వెలుగుచూశాయి.
టెస్లా పలువురు ఉద్యోగులను సాగనంపుతూ లేఆఫ్స్‌ను ముమ్మరం చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కంపెనీలో వరుసగా నాలుగో వారం కూడా లేఆఫ్స్ కొనసాగడంతో ఉద్యోగులు ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్ధితిలో ఉన్నారు. తమ టీంను దశల వారీగా కుదించవచ్చని ఓ ఉద్యోగి తన లేఆఫ్ నోటీస్‌ను లింక్డిన్లో షేర్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యోగుల్లో పది శాతం మందిని విధుల నుంచి తొలగిస్తామని ఏప్రిల్ 14న టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించినప్పటి నుంచీ లేఆఫ్స్ ప్రక్రియ ఊపందుకుంది. రిక్రూట్మెంట్, మార్కెటింగ్, సూపర్‌చార్జింగ్ టీం సహా పలు విభాగాల్లో ఉద్యోగులపై వేటు వేశారు. సూపర్‌చార్జింగ్ టీంలో దాదాపు 500 మందిని తొలగించారు.
Read More :
Kieron Pollard: బుమ్రాకు రెస్ట్ ఇచ్చే ఆలోచన లేదు: ముంబై ఇండియన్స్ కోచ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

