మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 18:15:53

దేశంలోకి చొర‌బ‌డేందుకు వేచి ఉన్న‌ ఉగ్ర‌వాదులు

దేశంలోకి చొర‌బ‌డేందుకు వేచి ఉన్న‌ ఉగ్ర‌వాదులు

ఢిల్లీ : భార‌త భూభాగంలోకి చొర‌బ‌డేందుకు నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి వివిధ లాంచ్ ప్యాడ్ల వ‌ద్ద 50 మంది ఉగ్ర‌వాదులు సిద్ధంగా ఉన్న‌ట్లు ఆర్మీ వ‌ర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ సైన్యం పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను కాశ్మీర్‌లోకి ప్ర‌వేశ‌పెట్టేందుకు కుట్రలు చేస్తోందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక పేర్కొంది. జమ్మూ కాశ్మీర్‌లోని మచిల్ సెక్టార్ ఎదురుగా ఉన్న కంట్రోల్ లైన్ (ఎల్‌ఓసి) మీదుగా లాంచ్ ప్యాడ్‌లలో 50 మంది ఉగ్రవాదులు క్యాంప్ వేసిన‌ట్లు తెలిపింది. ల‌ష్క‌రే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర‌సంస్థ‌ల‌తో సంబంధం ఉన్న 50 మంది ఉగ్ర‌వాదులు కెల్, తేజియాన్, సర్దారీ లాంచ్ ప్యాడ్‌లలో మాటువేసిన‌ట్లుగా వెల్ల‌డించింది. ఈ ఉగ్రవాదులకు భారత్‌లోకి చొప్పించి శాంతి, సామరస్యాన్ని దెబ్బ‌తీసేందుకు పాకిస్తాన్ అవకాశాల కోసం చూస్తున్న‌ట్లు పేర్కొంది. ఈ నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన సైన్యం చొర‌బాటుదారుల‌ను విజ‌యవంతంగా అడ్డుకుంటుంది. ఉగ్ర‌వాదుల కుట్ర‌ను భ‌గ్నం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో భాగంగా జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు.