BJP leader Killed : జమ్ములో బీజేపీ నేత దారుణహత్య
BJP leader Killed : జమ్ముకశ్మీర్‌లో బీజేపీ నేతను తీవ్రవాదులు దారుణంగా హతమార్చారు. కుల్గాం జిల్లాలోని బ్రజ్లూ జాగీర్ ప్రాంతంలో బీజేపీ నాయకుడిని మంగళవారం సాయంత్రం...

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో బీజేపీ నేతను (BJP leader Killed) తీవ్రవాదులు దారుణంగా హతమార్చారు. కుల్గాం జిల్లాలోని బ్రజ్లూ జాగీర్ ప్రాంతంలో బీజేపీ నాయకుడిని మంగళవారం సాయంత్రం తీవ్రవాదులు తుపాకీతో కాల్చి హతమార్చారు. మృతుడు జావీద్ అహ్మద్ దార్.. నియోజకవర్గ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలోకి బ్రజ్లూ జాగీర్ ప్రాంతంలోని దార్ ఇంట్లోకి నేరుగా వచ్చిన తీవ్రవాదులు ఒక్కసారిగా ఆయనపై తుపాకీ ఎక్కుపెట్టి పేల్చారు. దాంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అనంతరం తీవ్రవాదులు అక్కడి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన దార్‌ను కుటుంబసభ్యులు సమీపంలోని దవాఖానకు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటన అనంతరం భద్రతా దళాలు, పోలీసులు రంగంలోకి దిగి తీవ్రవాదులను కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యాయి.
ఈ ఘటనను దురదృష్టకరమైనది అని, ఇలా తుపాకులతో భయపెట్టాలని చూడటం తగదని బీజేపీ మీడియా సెల్ ఇంఛార్జీ మంజూర్ అహ్మద్ ఖండించారు. బీజేపీ నాయకుడిని హత్య చేయడాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. ‘కుల్గాంలో బీజేపీ నాయకుడుని తీవ్రవాదులు దారుణంగా హత్యగావించిన వార్త ఇప్పుడే అందింది. దీనిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. జావీద్ అహ్మద్ దార్ కుటుంబానికి, ఆయన పార్టీకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ఓమర్ అబ్దుల్లా ట్విట్టర్లో రాశారు.
ఇవి కూడా చదవండి..
అన్నం తినగానే నిద్రొస్తుందా..? అయితే, ఇవి పాటించండి..!
ట్విట్టర్ బర్డ్ ఫ్రై.. ఎందుకు చేశారంటే..?
మహారాజా రంజిత్ సింగ్‌కు తీరని అవమానం..!
వారు అధికారంలోకొచ్చారు.. మహిళా మోడల్స్‌పై సున్నమేశారు..!
ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్
మలేషియా ప్రధానిగా యాసిన్ రాజీనామా
లాహోర్‌ను పాకిస్తాన్కిచ్చిన రాడ్‌క్లిఫ్
మహిళలకు ఐఆర్సీటీసీ ‘రక్షాబంధన్’ కానుక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

