న్యూఢిల్లీ: మణిపూర్లో నిషేధిత ఉగ్రవాద సంస్థలు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.. తిరిగి యాక్టివ్ అవుతున్నాయని, లెఫ్టినెంట్ కర్నల్పై కాల్పుల ఘటన వెనుకున్నది ఈ సంస్థలేనని నిఘావర్గాలు వెల్లడించాయి. నిరసనకు దిగుతున్న గుంపులోకి ఉగ్రవాద సంస్థల సభ్యులు చొరబడుతున్నారని కేంద్ర భద్రతా బలగాలు భావిస్తున్నాయి. గతవారం టెంగ్నోపాల్ జిల్లాలోని ఓ గ్రామం వద్ద కొంతమంది ఆందోళన చేపట్టగా.. ఆర్మీ, అస్సాం రైఫిల్స్ అడ్డుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారి కాల్పులు చోటుచేసుకోగా.. లెఫ్టినెంట్ కర్నల్ రామన్ త్యాగీకి బుల్లెట్ గాయమైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన కేంద్ర భద్రతా బలగాలు.. గుంపుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థల సభ్యులు చేరుతున్నారని నిర్ధారించాయి.