న్యూఢిల్లీ: బోర్డర్ సెక్యూర్టీ దళాలు(BSF) కీలక ప్రకటన చేశాయి. జమ్మూ సమీపంలోని ఆక్నూర్కు మరో వైపు ఉన్న ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు బీఎస్ఎఫ్ ప్రకటించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబట ఫైరింగ్ జరుగుతున్న నేపథ్యంలో బీఎస్ఎఫ్ దళాలు కౌంటర్ దాడికి దిగాయి. పాకిస్థాన్‌లోని సియాల్కోట్ జిల్లాలో ఉన్న లూనీ ప్రాంతంలో ఆ ఉగ్రవాదుల బేస్ ఉన్నట్లు బీఎస్ఎఫ్ ప్రతినిధి తెలిపారు.
శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి జమ్మూ సెక్టార్లో ఉన్న బీఎస్ఎఫ్ పోస్టులపై పాకిస్థాన్ ఫైరింగ్‌కు పాల్పడింది. ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్ ఎదురుకాల్పులు జరిపింది. చాలా బలమైన రీతిలో ఉగ్రవాదుల అడ్డాను ధ్వంసం చేసింది. ఈ దాడిలో అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న పాకిస్థాన్ రేంజర్లకు చెందిన స్థావరాలకు తీవ్ర నష్టం జరిగినట్లు బీఎస్ఎఫ్ వెల్లడించింది.
భారత సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు చెక్కుచెదరకుండా ఉన్నామని బీఎస్ఎఫ్ ప్రతినిధి తెలిపారు.
On 09 May 2025, from about 2100 hrs, Pakistan opened fire on BSF posts in Jammu sector without any provocation.
BSF is responding in commensurate manner causing widespread damage to posts and assets of Pakistan Rangers along the International Boundary. Our resolve to protect…— BSF JAMMU (@bsf_jammu) May 10, 2025