శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో హర్వాన్‌లోని దచిగామ్ అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు సోమవారం సాయంత్రం సంయుక్తంగా కార్డన్ సెర్చ్ చేపట్టాయి.
ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురు కాల్పుల్లో ఓ టెర్రరిస్టును మట్టుబెట్టారు. మృతుడిని ఇంకా గుర్తించాల్సి ఉందని జమ్ము పోలీసులు వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నది. మరో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు ఉండొచ్చని భావిస్తున్నారు.
Based on specific intelligence input, joint parties of SFs launched CASO in the upper reaches of Dachigam forest. Contact established. OP is in progress. Details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) December 3, 2024