న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్నిన ఉగ్ర ముఠాను ఉత్తరప్రదేశ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో ఈ ముఠాకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. లక్నో, ఘజియాబాద్..తదితర ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించి…పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు ఈ ముఠా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
విదేశాల నుంచి నిధులు పొందుతున్న ఓ సంస్థ వీరికి సహకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. లక్నో రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే సిగ్నల్ బాక్స్‌ను లక్ష్యం చేసుకోవడానికి మీరట్‌కు చెందిన సాకిబ్, మరో ముగ్గురు ప్రయత్నిస్తుండగా వారిని కస్టడీలోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.