న్యూఢిల్లీ: సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలం గరిష్ఠంగా ఐదేండ్లు ఉండొచ్చన్న కేంద్ర చట్టాలను సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. సీవీసీ సవరణ చట్టం, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ సవరణ చట్టం, ప్రాథమిక హక్కుల సవరణ చట్టాలపై దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. ‘ఈడీ, సీబీఐ డైరెక్టర్ల నియామక కమిటీలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పదవీ కాలాన్ని పొడిగించమని సిఫారసు చేసినప్పుడే ఆయా సంస్థల డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగించవచ్చు. అయితే అది అయిదేండ్ల కాలాన్ని మించకూడదు’ అని కోర్టు తెలిపింది.