ఇంఫాల్, ఏప్రిల్ 20: ప్రభుత్వ విజ్ఞప్తులు, భద్రతా బలగాల మోహరింపును బేఖాతరు చేస్తూ మణిపూర్‌లో మైతీ తెగవారు సోమవారం రెండో రోజు కూడా లోయలో పూర్తి బంద్ పాటించడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మైతీల ప్రాబల్యమున్న బిష్ణుపూర్ జిల్లాలో ఈ నెల 7న బీఎస్ఎఫ్ జవాన్లు ఇద్దరు మైతీల పిల్లలను చంపగా, దానిని వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వారిలో ముగ్గురిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. దీనిని నిరసిస్తూ పలు మైతీ సంస్థలు ఐదు రోజలు బంద్‌కు పిలుపునిచ్చాయి. నాగాలు, కుకీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలు సంస్థలు కూడా హింసను వ్యతిరేకిస్తూ, న్యాయం చేయాలన్న డిమాండ్‌తో తమ ప్రాంతాల్లో బంద్‌ను చేపట్టాలని దృఢంగా నిర్ణయించాయి.