న్యూఢిల్లీ: కొవిడ్-19 లాక్‌డౌన్‌తో భూమిపై మానవ సంచారం సహా కార్యకలాపాలన్నీ నిలిచిపోయిన వేళ ఆశ్చర్యకరంగా చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. 2020 ఏప్రిల్-మే మధ్య జాబిల్లిపై ఉష్ణోగ్రతలు అసాధారణంగా పడిపోయినట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. రాత్రివేళ ఉష్ణోగ్రతలు 8-10 డిగ్రీల వరకు తగ్గిపోయినట్టు పేర్కొంది. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రిసెర్చ్ ల్యాబరేటరీ పరిశోధకులు కే దుర్గాప్రసాద్, జీ అంబిలీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కరోనా వల్ల పలు రంగాలు పనిచేయకపోవడం వల్ల ఈ ప్రభావం చంద్రుడిపై పడిందని చెప్పారు.