న్యూఢిల్లీ: మెసేజింగ్ వేదిక టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ యాప్ కొత డార్క్ వెబ్‌గా మారుతున్నదని, ఈ యాప్‌ను వినియోగిస్తున్న నేరగాళ్లు, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద సమూహాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది.
ఈ నెల 21న జరిగే నీట్ రీటెస్ట్ వల్ల పేపర్ లీక్‌ను అడ్డుకునేందుకు కేంద్రం తాత్కాలికంగా టెలిగ్రామ్‌పై నిషేధం విధించింది. టెలిగ్రామ్ హైకోర్టును ఆశ్రయించగా, కేంద్రం తన చర్యను సమర్థించుకుంటూ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. టెలిగ్రామ్‌పై నిషేధం విధించటం హక్కులను నిరోధించడం కాదా? అని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. తీర్పును వాయిదా వేసింది.