ప్రారంభం నాడే సేవలు కూడా..
కొత్త పార్లమెంట్ పనులు మొదలైన మూడ్రోజులకు మొదలైన తెలంగాణ నూతన సచివాలయం పనులు.. సీఎం కేసీఆర్ సూచనలతో కేవలం 26 నెలల్లోనే పూర్తయ్యాయి. అంతేకాదు, ప్రారంభించిన రోజు నుంచే మన సచివాలయంలో అన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి.
తెలంగాణ కొత్త సచివాలయం
పనులు ప్రారంభం: 18.01.2021
పనులు పూర్తి: 23.04.2023
ప్రారంభోత్సవం: 30.04.2023
సేవలు ప్రారంభం: 30.04.2023
రెండు నెలలైనా.. సేవలేవి?
వర్షకాల సమావేశాలను కొత్త పార్లమెంట్ భవనంలోనే ప్రారంభిస్తామంటూ గప్పాలు కొట్టిన మోదీ పరివారం పాత భవనంలోనే ఆ తంతును కానిస్తున్నాయి. ఎప్పుడో 60 రోజుల క్రితమే ప్రారంభమైన కొత్త పార్లమెంట్లో ఇంకా సేవలు ప్రారంభమే కాలేదు.
కొత్త పార్లమెంట్
పనులు ప్రారంభం: 15.01.2021
పనులు పూర్తి: 27.05.2023
ప్రారంభోత్సవం: 28.05.2023
సేవలు ప్రారంభం: ఇంకా లేదు
– (స్పెషల్ టాస్క్ బ్యూరో), హైదరాబాద్ (నమస్తే తెలంగాణ)