హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్ అడవుల్లో ఈ నెల 20న జరిగిన ఎన్‌కౌంటర్‌కు కోవర్టు ఆపరేషనే కారణమని తెలంగాణ పౌరహక్కుల సంఘం ఆరోపించింది. ఆ ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ రాజు, కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోస మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ బూటకమని సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్ర కమిటీ సభ్యులు సాధారణంగా గార్డుల రక్షణ వలయంలో ఉంటారని, వారు చనిపోయారంటే, వారికి రక్షణగా ఉన్న గార్డులు కూడా చనిపోయే ఉంటారని, కానీ ఆ విషయాన్ని పోలీసులు ప్రకటించలేదని గుర్తుచేశారు. కాబట్టి ఈ ఎన్కౌంటర్ కచ్చితంగా కోవర్ట్ ఆపరేషన్‌లో భాగంగానే జరిగినట్టు అర్థమవుతున్నదని చెప్పారు. మావోయిస్టులపై 21 నెలలుగా కేంద్ర చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేసి, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. మావోయిస్టులతో వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.