Tejashwi Yadav : బిహార్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం కొలువుతీరినా వీరు మిథిలాంచల్ అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఆరోపించారు. బిహార్‌లో తమ ప్రభుత్వం ఏర్పాటైతే తాము మిథిలాంచల్ అభివృద్ధి సంస్ధను నెలకొల్పుతామని ఆయన హామీ ఇచ్చారు. మిథిలాంచల్ సర్వతోముఖాభివృద్ధికి ఈ సంస్ధ పాటుపడుతుందని చెప్పారు.
మరోవైపు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని తేజస్వి యాదవ్ స్వాగతించారు. ఇక అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ స్వాగతించారు. ఎంతటి నియంతృత్వమైనా ఒకనాటికి సమసిపోక తప్పదని బీజేపీపై ఆయన విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ ఇప్పుడు జైలు నుంచి బయటకు రానున్నారని, ఈరోజు కోసం వేచిచూసిన వారందరికీ అభినందనలు తెలియచేస్తున్నానని, ఇవాళ ప్రజలంతా పండగ జరుపుకుంటారని గోపాల్ రాయ్ పేర్కొన్నారు.
నియంతృత్వ పోకడలు ఎంతటి స్ధాయిలో ఉన్నా ఏదోఒక రోజు వాటికి చెల్లుచీటీ తప్పదని ఇవాళ ఢిల్లీ సహా, దేశమంతటికీ ఈ తీర్పు ఓ సందేశం పంపిందని ఆయన వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌పై పన్నిన కుట్రలన్నీ ఇప్పుడు విఫలమయ్యాయని, కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే భారీ వేడుకలు నిర్వహిస్తామని ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయడం ఆప్‌నకు భారీ విజయమని అభివర్ణించారు. బీజేపీ రూపొందించిన నకిలీ స్కామ్ ఇప్పుడు బట్టబయలైందని అన్నారు.
Read More :
Nayanthara | నా ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్ అయ్యింది : నయనతార