Tejashwi Yadav | డబుల్ ఇంజిన్ సర్కార్‌లో డజనుకు పైగా వంతెనలు కుప్పకూలాయ్ : తేజస్వి యాదవ్
Tejashwi Yadav : బిహార్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని చెబుతున్నారని కానీ గత 20 రోజులుగా రాష్ట్రంలో డజనుకు పైగా వంతెనలు కుప్పకూలాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు.
Tejashwi Yadav : బిహార్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని చెబుతున్నారని కానీ గత 20 రోజులుగా రాష్ట్రంలో డజనుకు పైగా వంతెనలు కుప్పకూలాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు. ఆర్జేడీ వ్యవస్ధాపక దినం సందర్భంగా శుక్రవారం తేజస్వి మీడియాతో మాట్లాడారు. పలు రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
బిహార్‌లో విచ్చలవిడిగా నేరాలు పెచ్చుమీరాయని అన్నారు. పేపర్ లీక్ ఘటనలూ వెలుగుచూశాయని తేజస్వి యాదవ్ చెప్పారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ ఈ విషయాలపై మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఈ అంశాల గురించి మాట్లాడితే తేజస్వినే ఇదంతా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
గత 17 ఏండ్లుగా గ్రామీణాభివృద్ధి శాఖ జేడీయూతోనే ఉందని, ఇప్పుడు కూలిన బ్రిడ్జిలను ఎవరు మంజూరు చేశారు, ఎవరు శంకుస్ధాపన చేశారనే వివరాలను వెల్లడించాలని ఆయన సవాల్ విసిరారు. ఈ వివరాలు వెల్లడిస్తే ఎవరు అవినీతిపరులనేది తేటతెల్లమవుతుందని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ఇదంతా డబుల్ ఇంజిన్ సర్కార్ నిర్వాకమే అని ఆయన మండిపడ్డారు.
Read More :
Engineer Rashid | ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ఇంజినీర్ రషీద్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

