Tejas Mk1A : ఇండియా దేశీయంగా తయారు చేస్తున్న తేజాస్ ఎంకే1ఏ యుద్ధ విమానాలకు మరింత అదనపు బలం చేకూరనుంది. అమెరికా నుంచి అత్యాధునిక యుద్ధ విమాన ఇంజిన్లు ఇండియా చేరుకున్నాయి. ఈ విమానాలను తేజాస్ యుద్ధ విమానాలకు అమరుస్తారు. అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ సంస్థ ఎఫ్404-ఐఎన్20 ఇంజిన్లు నాలుగింటిని తేజాస్ విమానాలు తయారు చేస్తున్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంస్థకు అందాయి.
గత సెప్టెంబర్లోనే ఈ ఇంజిన్లను సంస్థ అదుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ తరహా ఇంజిన్లు మొత్తం 14 అందాయి. అంటే, 14 తేజాస్ ఎంకే1ఏ విమానాలలో అమెరికా ఇంజిన్లను ఏర్పాటు చేస్తున్నారు. జీఈ ఏరోస్పేస్ సంస్థతో ఇండియా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం 99 యుద్ధ విమాన ఇంజిన్లను సంస్థ అప్పగించాల్సి ఉంటుంది. వీటి విలువ మొత్తం రూ.5,375 కోట్లు. గత నెలలో 4 విమానాల్ని అందించామని, మిగతా విమానాల్ని అందించేందుకు కృషి చేస్తున్నామని జీఈ ఏరోస్పేస్ సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధ విమానాల్లో ఎఫ్404-ఐఎన్20 ఇంజిన్లు అత్యంత ప్రబావవంతమైన, విజయవంతమైన ఇంజిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి.
భారత వైమానిక దళ అవసరాలకు అనుగుణంగా హైయ్యర్ ఫ్లో ఫ్యాన్, సింగిల్ క్రిస్టల్ టర్బైన బ్లేడ్స్ వంటి అనేక ప్రత్యేక విడిభాగాలు ఈ ఇంజిన్లో ఉన్నాయి. ఈ ఇంజిన్లు తేజాస్ విమానానికి బాగా సరిపోతాయి. అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ సంస్థతో ఇండియా కొన్ని దశాబ్దాలుగా కలిసి పని చేస్తోంది. 1980ల నుంచి యుద్ధ విమానాల తయారీలో ఇండియాకు సహకరిస్తోంది. ముఖ్యంగా తేజాస్ యుద్ధ విమానాలలో ఈ సంస్త ఇంజిన్లు కీలకంగా నిలిచాయి.