పాట్నా : ఆర్జేడీ నాయకుడు, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను త్వరలోనే ఆర్జేడీకి రాజీనామా చేస్తానని తేజ్ ప్రతాప్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆర్జేడీలో నేను మా నాన్న అడుగుజాడల్లో నడిచాను. పార్టీలో అందరికీ గౌరవం ఇచ్చాను. త్వరలోనే మా నాన్నను కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తాను అని తేజ్ ప్రతాప్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే తేజ్ ప్రతాప్ కేవలం పార్టీ సభ్యత్వానికే రాజీనామా చేస్తారా? లేక ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా? అన్న విషయంపై స్పష్టత లేదు.
అయితే యువ ఆర్జేడీ సిటీ యూనిట్ అధ్యక్షుడు రామ్ రాజ్ యాదవ్‌ను తేజ్ ప్రతాప్ దుర్భాషలాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తేజ్ ప్రతాప్ చేసిన ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల మాజీ సీఎం రబ్రీ దేవీ నివాసంలో ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరైన సందర్భంగా, తనను తేజ్ ప్రతాప్ ఓ గదిలో బంధించి కొట్టినట్లు రామ్ రాజ్ యాదవ్ ఆరోపించారు.
मैं अपने पिता के नक्शे कदम पर चलने का काम किया । सभी कार्यकर्ताओं को सम्मान दिया जल्द अपने पिता से मिलकर अपना इस्तीफा दूंगा ।@laluprasadrjd @RJDforIndia @yadavtejashwi @RabriDeviRJD @MisaBharti @Chiranjeev_INC
— Tej Pratap Yadav (@TejYadav14) April 25, 2022