పాట్నా: బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) మళ్లీ భక్తి భావంలో మునిగిపోయారు. ఆయన శివలింగాన్ని హత్తుకుని అభిషేకం నిర్వహించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తేజ్ ప్రతాప్ యాదవ్ సోమవారం ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. శివలింగాన్ని ఆయన కౌగిలించుకోగా ఒక సాధువు అభిషేకం నిర్వహించారు. తేజ్ ప్రతాప్ తలపై నీరు, పాలు, ఇతర జలాలు పోశారు. ‘అంతిమ సత్యానికి చిహ్నం మహాదేవ్. మహాదేవ్‌ను కౌగిలించుకోవడం అంటే మనలోని లోతైన, అత్యంత లోతైన అంశాలను స్వీకరించడం. శాంతిని పొందడం. గందరగోళం మధ్యలో మహాదేవ్‌ను కనుగొనడం. హరహర మహాదేవ్’ అని తేజ్ ప్రతాప్ అందులో పేర్కొన్నారు.
కాగా, తన సోదరుడు తేజస్వి యాదవ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు ఈ పోస్ట్‌ను తేజ్ ప్రతాప్ ట్యాగ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తేజ్ ప్రతాప్ యాదవ్ చాలా కాలంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గతేడాది హోలీ సందర్భంగా శ్రీకృష్ణుడి వేషంలో అందరినీ ఆకట్టుకున్నారు.
Mahadev is the symbol of ultimate truth. To embrace Mahadev is to embrace the deepest, most profound aspects of ourselves.
To find peace in the midst of chaos is to find Mahadev.
🕉️🔱Har Har Mahadev🕉️🔱 @yadavtejashwi @RJDforIndia @yadavakhilesh @RahulGandhi pic.twitter.com/aK5Ow9j7zq— Tej Pratap Yadav (@TejYadav14) July 7, 2024