Tejpratap Yadav | మూడేళ్లుగా కరెంటు బిల్లు కట్టని తేజ్ ప్రతాప్ యాదవ్.. రూ.3.6 లక్షలు దాటిన బకాయిలు
Tejpratap Yadav | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో ఓటమి, కుటుంబ కలహాల నేపథ్యంలో ఆర్జేడీ (RJD) అధినేత లాలూప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tejpratap Yadav) పేరు ప్రముఖంగా వినిపించింది.
Tejpratap Yadav : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో ఓటమి, కుటుంబ కలహాల నేపథ్యంలో ఆర్జేడీ (RJD) అధినేత లాలూప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tejpratap Yadav) పేరు ప్రముఖంగా వినిపించింది. తాజాగా ఆయనకు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది.
తేజ్ ప్రతాప్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లు గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉంది. దాంతో ఆ మొత్తం రూ.3.6 లక్షలు దాటిందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం తేజ్‌ప్రతాప్ ప్రభుత్వ నివాసంలో ఉంటున్నారు. అయితే పట్నాలో ఆయనకు చెందిన ఓ ప్రైవేటు ఇంటికి చివరిసారిగా 2022 జూలైలో కరెంటు బిల్లు చెల్లించారు.
గత మూడేళ్లుగా దీనికి సంబంధించిన బకాయిలు పేరుకుపోయాయి. జరిమానాలతో కలిపి ఇప్పుడా మొత్తం కరెంటు బిల్లు రూ.3.61 లక్షలకు చేరింది. ఇక తేజ్‌ప్రతాప్ పేరు మీద మరో కరెంట్ కనెక్షన్ ఉన్నట్లు విద్యుత్తు శాఖ డేటా వెల్లడిస్తోంది. దీనికి సంబంధించిన బకాయిలు కూడా జరిమానాలతో కలిపి రూ.3,24,974 చెల్లించాల్సి ఉందని విద్యుత్ అధికారులు తెలిపారు.
ఈ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. బకాయిలు పేరుకుపోకుండా ఉండేందుకు బీహార్ ప్రభుత్వం ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ తేజ్ ప్రతాప్ తన నివాసానికి పోస్ట్‌పెయిడ్ మీటర్‌నే కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం రూ.25 వేల కంటే ఎక్కువ బిల్లు ఉంటే ఏ పోస్టుపెయిడ్ కనెక్షన్‌ను అయినా డీయాక్టివ్ చేయాలి.
అయితే తేజ్‌ప్రతాప్ ఇంటి విద్యుత్ బిల్లు బకాయిలు రూ.3 లక్షలు దాటినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడీ వ్యవహారం కాస్త చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

