గువాహటి, ఆగస్టు 20: కొండ చరియలు విరిగి పడటంతో సిక్కింలోని ఎన్హెచ్పీసీ తీస్తా అయిదో దశ ఆనకట్ట పవర్ స్టేషన్ ధ్వంసమైంది. గత కొన్ని వారాలుగా తరచూ తక్కువ స్థాయిలో కొండ చరియలు విరిగిపడటంతో ఈ 510 మెగావాట్ల స్టేషన్కు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఈ స్టేషన్ను ఖాళీ చేయించడంతో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. గతేడాది అక్టోబర్లో భారీ వర్షం కారణంగా ల్హోనాక్ హిమానీ నదపు సరస్సు కట్టలు తెగిపోవడంతో అయిదో దశ ఆనకట్ట పనికి రాకుండా పోయింది.