న్యూఢిల్లీ, మే 6: హుక్కా కేంద్రంలో జరిగిన కాల్పుల్లో ఓ యువకుడు మృతిచెందిన ఘటన న్యూఢిల్లీలోని గోవింద్పురిలో శనివారం చోటుచేసుకుంది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేశ్ డియో తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం… గోవింద్పురిలోని ఓ హుక్కా కేంద్రంలో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న కునాల్(17) అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులు అతన్ని ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఇదే ఘటనలో గాయాలపాలైన రాహుల్ చికిత్స పొందుతున్నాడు. అనుమానితున్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హుక్కా సెంటర్ను గతంలోనే మూసివేసినప్పటికి అనుమతులు లేకుండా నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు.