Crime news : ఏ తండ్రైనా కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించి, మంచి సంబంధం చూసి, పెళ్లిచేసి పంపిస్తాడు. కానీ ఓ యువతి తండ్రి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. మేడపైకి తీసుకెళ్లి దారుణంగా కాల్చిచంపాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే ఆమె 15 ఏళ్ల తమ్ముడు కూడా ఈ హత్యలో పాలుపంచుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జల్లా కాండ్లా పోలీస్స్టేషన్ పరిధిలోని అంబెహ్తా గ్రామంలో ముస్కాన్ అనే 17 ఏళ్ల యువతి కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. ఆదివారం సాయంత్రం ఆమె ఫోన్ చాటింగ్ చూసిన తండ్రి యువతిని మేడపైకి తీసుకెళ్లాడు. యువతి 15 ఏళ్ల తమ్ముడు కూడా అక్కను దూషిస్తూ వారితో వెళ్లాడు. పైకి వెళ్లిన తర్వాత ఆ యువతిని పిస్తల్తో కాల్చిచంపారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ముస్కాన్ ఓ అబ్బాయితో చాటింగ్ చేస్తూ తమ కుటుంబం పరువు తీస్తోందని, అందుకే చంపేశామని పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయ్యింది.