Trump Tariffs | హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ విధానాలతో ఇండియాతో పాటు హైదరాబాద్‌లో ఐటీ రంగానికి వచ్చే నష్టమేమీ లేదని టెక్నోజెన్ సీఈవో లాక్స్ చేపూరి అభిప్రాయపడ్డారు. అమెరికా చైనాపై విధిస్తున్న ప్రతీకార సుంకాలతో భారత్‌కు అనేక కంపెనీలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ ‘మేక్ ఇన్ అమెరికా’ అని ఆయా సంస్థలను యూఎస్ఏకి ఆహ్వానిస్తున్నారని.. భవిష్యత్తులో ఉద్యోగాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు.
హెచ్1బీ వీసా ఉన్నవారు తమ వీసా స్టేటస్ సరిగా ఉంచుకుని.. అమెరికా చట్టాలు పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు. ‘గోల్డెన్ వీసాకు రూ.45 కోట్లు (5 మిలియన్ డాలర్లు) లీగల్ మనీ వెచ్చించి వెయ్యి మంది దరఖాస్తు చేసుకున్నారంటే అమెరికా క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. యూరప్‌లో జీవన వ్యయం ఎక్కువ.. అందుకే ఐటీ ఉద్యోగాలకు అమెరికా గమ్యస్థానంలా ఉంటుందనడంలో సందేహం లేదు’ అని ఆయన అన్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను లాక్స్ చేపూరి పంచుకున్నారు.
నమస్తే తెలంగాణ: సుంకాల విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో మన ఐటీ సెక్టార్‌పై ఏమైనా ప్రభావం ఉంటుందా..?
నమస్తే తెలంగాణ: ట్రంప్ విధానాలతో ప్రత్యక్షంగా హైదరాబాద్ ఐటీ ఉద్యోగులపై ప్రభావం ఎలా ఉండబోతున్నది?
నమస్తే తెలంగాణ: హెచ్1బీ వీసా కలిగి ఉన్న మన వాళ్లపై ట్రంప్ నిర్ణయాలు ఏ మేరకు ప్రభావం చూపుతాయి?
నమస్తే తెలంగాణ: భవిష్యత్తులో మన దగ్గర ఐటీ విస్తరణ ఎలా ఉండబోతున్నది?
నమస్తే తెలంగాణ: ఖర్చుల నియంత్రణలో భాగంగా అమెరికా ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నది కదా? ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు..?
నమస్తే తెలంగాణ: తాజా పరిణామాలతో అమెరికాలో ఉంటున్న భారతీయుల ఆలోచనా ధోరణి ఎలా ఉంది?
నమస్తే తెలంగాణ: అమెరికాలో స్థిర పడ్డ మనవాళ్లు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతుంటారు.. ట్రంప్ నిర్ణయాల ఎఫెక్ట్ రియల్ రంగంపై ఏమైనా ఉంటుందా?
నమస్తే తెలంగాణ: ప్రస్తుతం నెలకొన్న పరిణామాలతో రానున్న రోజుల్లో అమెరికా ఉద్యోగులకు గమ్యస్థానంగా ఉంటుందా? లేదా యూరోప్ లాంటి ఇతర దేశాలను ఎంచుకోవాలా?