న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన కొన్ని కుటుంబాలు భారత్‌కు వచ్చాయి. అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలు వారిని విడదీశాయి. దీంతో భారతీయ పౌరులైన తల్లలను పాక్ పౌరసత్వం ఉన్న పిల్లలు భారంగా విడిచివెళ్లాల్సి వచ్చింది. (Pak Child leaves Indian mothers behind) పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్, భారత్‌కు చెందిన నబీలాకు చాలా ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఢిల్లీలో ఉన్న తల్లిని చూసేందుకు నబీలా తన భర్త, పిల్లలతో కలిసి భారత్ వచ్చింది.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పౌరులు తిరిగి వెళ్లాలన్న ప్రభుత్వ ఆదేశాలు తల్లీ పిల్లలను విడదీశాయి. నబీలాకు భారత పాస్‌పోర్ట్ ఉండటంతో ఆమె పాక్ తిరిగి వెళ్లేందుకు అధికారులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో పాక్ పౌరులైన 11 ఏళ్ల జైనాబ్, 8 ఏళ్ల జెనీష్ తమ తల్లిని భారంగా వీడారు. తండ్రి మహ్మద్ ఇర్ఫాన్‌తో కలిసి పంజాబ్ సరిహద్దు మీదుగా పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు పిల్లలు తమ తల్లిని విడిచి వెళ్లడంపై కన్నీటి పర్యంతమయ్యారు.
మరోవైపు మహ్మద్ ఇమ్రాన్, షర్మీన్ దంపతులు 18 ఏళ్లుగా పాకిస్థాన్‌లోని కరాచీలో నివసిస్తున్నారు. తమ కుమార్తెలతో కలిసి వారు భారత్‌కు వచ్చారు. షర్మీన్‌కు భారత పాస్‌పార్ట్ ఉండటంతో పాక్ తిరిగి వెళ్లేందుకు ఆమెను అనుమతించలేదు. దీంతో పాక్ పౌరసత్వం ఉన్న కుమార్తెలను తీసుకుని ఇమ్రాన్ ఆ దేశానికి తిరిగి వెళ్లాడు. తల్లి షర్మీన్ను అధికారులు అనుమతించకపోవడంతో ఆమె పిల్లలు భావోద్వేగం చెందారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తల్లీబిడ్డలను విడదీయడం తగదని పాక్ కుటుంబాలు వాపోయాయి. ‘ఉగ్రవాదులను కఠినంగా శిక్షించండి. అమాయకులైన మా కుటుంబాలను విడదీయకండి’ అని భారత ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
Attari, Punjab: An Indian woman married to a Pakistani national says, “We are being stopped from going, they are saying that Indian passport holders cannot go to Pakistan. My children and husband are Pakistani citizens, so how will I live here…” pic.twitter.com/ou4BlSAofi
— IANS (@ians_india) April 27, 2025
Punjab: A person at Attari-Wagah Border says, “Indian passports are not allowed here. Pakistani passports there are not allowed here. Our request is simple: those who have a valid visa and are married there, let them go…” pic.twitter.com/sTpSeM3dqP
— IANS (@ians_india) April 25, 2025