న్యూఢిల్లీ, నవంబర్ 25: ఓ పాఠశాలలోని టీచర్లు హోమ్‌వర్క్ చేయలేదన్న కోపంతో ఐదేండ్ల పిల్లాడ్ని చెట్టుకు వేలాడదీశారు. ఛత్తీస్‌గఢ్ సురాజ్‌పూర్ జిల్లాలోని నారాయణ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది. బాలుడ్ని కొన్ని గంటలపాటు చెట్టుకు వేలాడదీసిన ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్‌మీడియాలో విడుదలైంది. దీంతో టీచర్ల అమానుష చర్యపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. విషయం తెలుసుకున్న వెంటనే వందలాది మంది గ్రామస్థులు స్కూల్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. సమగ్రమైన దర్యాప్తు చేసి బాధ్యులైన వారిని శిక్షిస్తామని జిల్లా అధికారుల చెప్పటంతో గ్రామస్థులు శాంతించారు.