చెన్నై: క్లాస్‌లో హిందీ కవిత చెప్పనందుకు ఒక స్టూడెంట్ను టీచర్ కొట్టింది. ఆ విద్యార్థి పేరెంట్స్ దీనిపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు. హిందీని తీవ్రంగా వ్యతిరేకించే తమిళనాడులో ఈ సంఘటన జరిగింది. (Teacher Suspended) ఫిబ్రవరి 21న చెన్నైలోని ప్రముఖ రాజాజీ విద్యాశ్రమ పాఠశాలలో హిందీ కవిత చెప్పమని మూడో తరగతి విద్యార్థిని టీచర్ అడిగింది. ఆ బాలుడు చెప్పలేకపోవడంతో ఆ ఉపాధ్యాయురాలు కొట్టింది.
కాగా, ఆ స్టూడెంట్ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. దీంతో వారు స్కూల్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం ఈ సంఘటనపై అంతర్గతంగా దర్యాప్తు జరిపింది. సోమవారం ఆ టీచర్‌ను సస్పెండ్ చేసింది. అయితే విద్యార్థులపై భౌతికంగా దాడికి సంబంధించిన ‘జీరో టాలరెన్స్’ విధానానికి అనుగుణంగా ఆ లేడీ టీచర్‌పై చర్యలు చేపట్టినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. రాష్ట్రంలో హిందీ భాష పట్ల వ్యతిరేకతకు ఈ సంఘటనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.