కాన్పూర్: యూపీలోని కాన్పూరులో నీట్ కోసం శిక్షణనిచ్చే ఓ ప్రముఖ సంస్థకు చెందిన ఇద్దరు టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఫతేపూర్ బాలిక కాన్పూర్‌లోని నీట్ శిక్షణ సంస్థలో చేరారు. ఆమె సిటీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటుండగా, ఈ శిక్షణ కేంద్రంలోని బయాలజీ టీచర్ సాహిల్ సిద్ధిఖీ తన స్నేహితుని ఫ్లాట్‌కు రావాలని ఆమెను పిలిచాడు. న్యూ ఇయర్ పార్టీ జరుగుతుందని, ఇతర విద్యార్థులు కూడా వస్తారని చెప్పాడు. కానీ ఆమె ఆ ఫ్లాట్‌కు వెళ్లేసరికి సిద్ధిఖి ఒక్కడే ఉన్నాడు.
అతడు ఆమెకు మత్తు మందు పానీయాన్ని ఇచ్చి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే ఆ రేప్ వీడియోను ఆన్లైన్లో షేర్ చేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత ఆరు నెలలపాటు అదే ఫ్లాట్‌లో ఆమెను నిర్బంధించి, పదే పదే అత్యాచారం చేశాడు. ఇదే కోచింగ్ సెంటర్లోని కెమిస్ట్రీ టీచర్ వికాస్ పోర్వాల్ కూడా సిద్ధిఖీ ఎపిసోడ్ తర్వాత ఆమెపై లైంగిక దాడి చేశాడు. తర్వాత తన తల్లి తనను ఇంటికి తీసుకెళ్లారని బాధితురాలు తెలిపారు. సిద్ధిఖీ వేరొక స్టూడెంట్ను వేధిస్తున్న వీడియోను చూశానని, దీంతో తనపై జరిగిన లైంగిక దాడిపై గురించి ఫిర్యాదు చేశానని బాధితురాలు తెలిపారు.