న్యూఢిల్లీ : కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ముడి పామాయిల్‌పై పన్నును 7.5 శాతం నుంచి 5 శాతానికి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ను తగ్గిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే ఎడిబిల్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గింపును ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది.
ప్రస్తుతం ఉన్న గడువు వచ్చే మారి 31తో ముగియనున్నది. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ తగ్గింపు.. ముడి పామాయిల్, రీఫైన్డ్ పామాయిల్ దిగుమతి సుంకం మధ్య అంతరం పెరుగుతుంది. దీంతో భారతీయ రీఫైనర్లకు పామాయిల్ దిగుమతి చౌకగా మారనున్నది. పన్ను మినహాయింపు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చింది.
దీంతో దిగుమతి పన్ను గ్యాప్ 8.25శాతానికి పెరుగుతుందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. స్థానిక రిఫైనరీలను ప్రోత్సహించేందుకు ఈ గ్యాప్‌ను 11శాతానికి పెంచాల్సిన అవసరం ఉందన్నారు.