Air India | టాటా సన్స్ చేతుల్లోకి ఎయిర్ ఇండియా !

న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా సన్స్ టేకోవర్ చేసుకోనున్నది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కోసం సమర్పించిన బిడ్స్‌ను టాటా సన్స్ గెలుచుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో దీనిపై తుది ప్రకటన చేయనున్నది. కేంద్ర హోంశాఖ నేతృత్వంలోని నిపుణుల బృందం టాటా సన్స్ సమర్పించిన బిడ్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ జరగనుంది. జాతీయ పౌర విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాను అమ్మేందుకు గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి.
2018 మార్చిలో కేంద్రం ఎయిర్ ఇండియాలో 76 శాతం షేర్లను అమ్మేందుకు ఇంట్రెస్ట్ చూపింది. అయితే అప్పుడు స్పందన కరువైంది. భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా ఇక టాటా సన్స్ చేతుల్లోకి వెళ్లనున్నది. ఎయిరిండియా (Air India sale) అమ్మకం కోసం టాటా సన్స్ తో పాటు స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్‌సింగ్ బిడ్స్ వేశారు. ఎయిర్ ఇండియా ప్రతి రోజు సుమారు 20 కోట్ల నష్టాన్ని చవిచూస్తోంది. దీంతో ఆ సంస్థ ఇప్పటి వరకు 70 వేల కోట్ల నష్టంలో ఉన్నది. దివాళా తీసిన ఎయిర్ ఇండియాను టాటా చేజిక్కించుకోవడం కొంత ఊరటనిచ్చే అంశం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

