ముంబై : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు టాటా సన్స్ గ్రూప్ అండగా నిలిచింది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు రూ.500 కోట్లతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎయిరిండియాలో 74 శాతం వాటాతో ప్రధాన సంస్థగా ఉన్న టాటా సన్స్ ఏఐ171 ట్రస్ట్ పేరుతో సంస్థను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.
ఇప్పటికే టాటా సన్స్, ఎయిరిండియాతో కలిసి బాధిత కుటుంబాలకు రూ.1.25 కోట్ల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రస్తుతం ఏర్పాటు కానున్న ట్రస్ట్‌కు టాటా సన్స్ అధిపతి చంద్రశేఖరన్ చైర్మన్‌గా ఉండనున్నారు.