న్యూఢిల్లీ: భారత దిగ్గజ ఐటీ కంపెనీగా పేరొందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో విచిత్రమైన పరిస్థితి కొనసాగుతున్నది. ఆ కంపెనీలో దాదాపు 80 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఇది ఆ కంపెనీలోని ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలకు, కంపెనీ అవసరాలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని (స్కిల్ గ్యాప్‌ను) స్పష్టం చేస్తున్నది. దీంతో ఈ లోటును పూడ్చుకునేందుకు కాంట్రాక్టర్లపై ఆధారపడాల్సి వస్తున్నదని టీసీఎస్ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ (ఆర్ఎంజీ) గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ అమర్ షెట్యే తెలిపారు. కాగా, ఫ్రెషర్లను ఉద్యోగాల్లో చేర్చుకోవడంలో టీసీఎస్తోపాటు ఇతర భారత ఐటీ దిగ్గజాలు సాచివేత ధోరణిని అవలంబిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ జాప్యాల వల్ల గత రెండ్లలో దాదాపు 10 వేల మంది ఫ్రెషర్లు నష్టపోయినట్టు నాస్కెంట్ ఐటీ ఎంప్లాయీస్ సెనేట్ వెల్లడించింది.