Tariffs Row | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీనియర్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్‌పై విమర్శల దాడి చేశారు. ఈ సారి ఆయన ఎలాన్ మస్క్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ను సైతం టార్గెట్ చేశారు. ఎక్స్ ఫ్యాక్ట్‌చెక్ ‘తప్పుదారి పట్టించేదిస అని పేర్కొన్నారు. రష్యా నుంచి చౌకగా ముడి చమురును కొనుగోలు చేస్తూ భారత్ లాభాలను ఆర్జిస్తోందని.. ఆయిల్ కొనుగోలుతో వచ్చిన డబ్బుతో రష్యా యుద్ధ యంత్రాన్ని నడిపిస్తుందని పీటర్ నవారో ఆరోపించారు. ‘భారత్ అధిక సుంకాలు అమెరికన్ ఉద్యోగాలను చంపుతోందని.. భారత్ లాభం కోసమే రష్యన్ చమురును కొనుగోలు చేస్తుంది. ఈ ఆదాయం రష్యాకు యుద్ధంలో బలాన్ని ఇస్తుంది. ఉక్రేనియన్లు, రష్యన్లు చనిపోతున్నారు.
అమెరికన్ పన్ను చెల్లింపుదారులు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు. భారతదేశం సత్యాన్ని తట్టుకోలేక అబద్ధాలను వ్యాప్తి చేస్తోంది’ భారతదేశం యొక్క అధిక దిగుమతి సుంకం (సుంకం) కారణంగా అమెరికన్ పరిశ్రమ భారీ నష్టాలను చవిచూస్తోందని కూడా నవారో ఆరోపించారు. పీటర్ నవారో పోస్ట్ కింద ఎక్స్ ఓ ఫ్యాక్ట్ చెక్‌ను జోడించి.. రష్యన్ చమురు కొనుగోలు చేయడం పూర్తిగా చట్టబద్ధమైందని.. దాని ఇంధన భద్రత కోసం అంటూ కామెంట్‌ని జోడించారు. ఎక్స్ ఫ్యాక్ట్‌చెక్ “భారతదేశం రష్యన్ చమురు దిగుమతులు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించవు” అని పేర్కొంది. “భారతదేశం కొన్ని ఉత్పత్తులపై సుంకాలు ఉన్నప్పటికీ, భారతదేశంతో సేవలలో అమెరికాకు వాణిజ్య మిగులు ఉంది. అమెరికా ఇప్పటికీ రష్యా నుంచి యురేనియం వంటి కొన్ని వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిస్థితిలో భారత్‌ను విమర్శించడం ద్వంద్వ ప్రమాణాలను చూపుతుంది అని పేర్కొంది.
ఆ తర్వాత ఎక్స్ యజమాని ఎలోన్ మస్క్‌పై సైతం నవారో విమర్శలు గుప్పించారు. ‘వావ్! ఎలోన్ మస్క్ ప్రజల పోస్ట్లలోకి ప్రచారాన్ని అనుమతిస్తున్నారు. ఫ్యాక్ట్‌చెక్ అర్థం లేనిదని.. భారతదేశం లాభాపేక్ష కోసం మాత్రమే రష్యన్ చమురును కొనుగోలు చేస్తుందని.. యుద్ధానికి ముందు భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయలేదన్నారు. ఉక్రేనియన్లను చంపడం ఆపండి.. అమెరికన్ ఉద్యోగాలను తొలగించడం ఆపండి అంటూ స్పందించారు. ఇదిలా ఉండగా.. భారత్‌పై అమెరికా ఇప్పటి వరకు 50శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దాంతో భారత్ ఎగుమతులపై 50శాతం కంటే ఎక్కువగా సుంకాలు ఉన్నాయి. బ్రెజిల్ కంటే అత్యధికం.
సుంకం విధించిన కొన్ని గంటలకే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ యుద్ధంగా నవారో అభివర్ణించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యా సైనిక దురాక్రమణ బలపడుతోందని ఆరోపించారు. నవారో మరింత ఘాటుగా ఆరోపణలు చేస్తూ భారత్-క్రెమ్లిన్‌ను లాండ్రోమాట్ గా పిలుస్తూ.. భారతీయ ప్రజల ఖర్చుతో లాభపడుతున్న బ్రాహ్మణులు ఉన్నారుస అంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. భారత శుద్ధి కర్మాగారాలు చౌకైన రష్యన్ ముడి చమురును ప్రాసెస్ చేసి, అధిక ధరలకు ఇతర దేశాలకు అమ్ముతున్నాయని ఆయన పేర్కొన్నారు. రష్యా-చైనాతో ప్రధాని మోదీ సందేశం సుంకం వివాదం మధ్య, చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అక్కడ ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌లతో సమావేశమయ్యారు.
FACTS: India highest tariffs costs U.S. jobs. India buys Russian oil purely to profit/Revenues feed Russia war machine. Ukrainians/Russians die. U.S. taxpayers shell out more. India can’t handle truth/spins @washpo
Leftist American fake news. QED. https://t.co/9UwdodYBEe— Peter Navarro (@RealPNavarro) September 5, 2025