చెన్నై: జర్మన్ తత్వవేత్త, సోషలిస్టు నేత కార్ల్ మార్క్స్ విగ్రహాన్ని చెన్నైలో ప్రతిష్టించనున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (CM Stalin) తెలిపారు. ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. కార్ల్ మార్క్స్ కాలంలోనే లేబర్ ఉద్యమం ఓ శతాబ్ధం పాటు సాగింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యుడు పీకే మూకియా థీవర్ స్మారక భవనాన్ని మధురై జిల్లాలో నిర్మించనున్నట్లు సీఎం స్టాలిన్ చెప్పారు.
అసెంబ్లీలో రూల్ 110 కింద సుమోటో ప్రకటన చేశారు. ప్రపంచ నేత కార్ల్ మార్క్స్కు ద్రవిడ మోడల్ ప్రభుత్వం నివాళి అర్పించనున్నట్లు తెలిపారు. మార్క్స్ ఓ విజనరీ నేత అని, ఉద్యమకారుడని, కమ్యూనిజం ఫిలాసఫీని రూపొందించారని, ప్రపంచ కార్మికులను ఏకం చేశారని ఆయన అన్నారు.