Karur Stampede : తమిళనాడులోని కరూర్(Karur)లో టీవీకే పార్టీ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Stampede)లో మృతుల సంఖ్య 36కు చేరింది. వీరిలో ఎనిమిది మంది పిల్లలు, 16 మంది మహిళలు మృత్యువాత పడ్డారు. ఈ దురదృష్టకరమైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (Stalin) తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. అంతేకాదు బాధితులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం నష్టపరిహారాన్ని(Exgratia) ప్రకటించింది. తొక్కిసలాటలో మరణించిన వాళ్ల కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారంగా చెల్లిస్తామని తెలిపింది.
‘కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలో కోల్పోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు పరిహారంగా చెల్లిస్తాం. అంతేకాదు ఈ ఘటనపై విచారణకు కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం. హైకోర్ట్ రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ తొక్కిసలాటపై దర్యాప్తు చేపడుతారు’ అని తమిళనాడు సీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది.
🚨 Breking
Heartbreaking from #Karur, Tamil Nadu.
A stampede at the #Vijay rally claimed 10 innocent lives.
Families came to see their hero, but returned with unbearable grief. 💔 pic.twitter.com/MXibh72gdV
— Adorable (@rehnedotumm_) September 27, 2025
యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ తొక్కిసలాటపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు. అందర్నీ షాక్‌కు గురి చేసిన ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.