Tamilnadu Governor :తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్
Tamilnadu Governor : ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి చదవలేదు. రెండు నిమిషాల్లో ఆయన తన ప్రసంగాన్ని ముగించేసి తమిళనాడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. డీఎంకే ప్రభుత్వం జాతీయ గీతాన్ని గౌరవించడంలేదన్నారు.
చెన్నై: తమిళనాడు గవర్నర్(Tamilnadu Governor ) ఆర్ఎన్ రవి .. డీఎంకే పార్టీ వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీని ఉద్దేశించి ఇవాళ ఆయన ప్రసంగం చేశారు. అయితే కొన్ని క్షణాల్లోనే ఆయన తన ప్రసంగాన్ని ముగించేశారు. ప్రసంగం ప్రారంభానికి ముందు, చివరకు జాతీయ గీతాన్ని ఆలపించలేదన్నారు. ప్రసంగ పాఠాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. జాతీయ గీతాన్ని డీఎంకే గౌరవించలేదన్నారు. అందుకే తన ప్రసంగాన్ని తొందరగా ముగించి వెళ్తున్నట్లు ఆయన చెప్పారు.
గవర్నర్ ప్రసంగం కోసం తమిళనాడు అసెంబ్లీ ఇవాళ సమావేశమైంది. అయితే ప్రసంగ పాఠంలో ఉన్న అనేక అంశాలను తాను వ్యతిరేకిస్తున్నట్లు గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. అంగీకరించిన అంశాల గురించి ప్రసంగంలో చెప్పడం.. రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని ఆయన అన్నారు. సభ మీద ఉన్న గౌరవంతో తన ప్రసంగాన్ని త్వరగా ముగించేస్తున్నట్లు చెప్పారు.
అయితే సభాకార్యక్రమాలు సజావుగా సాగాలని, ప్రజల కోసం ఆరోగ్యకరమైన చర్చలు చేపట్టాలని రవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ కూడా తన ప్రసంగాన్ని అర్థాంతంగా ముగించిన విషయం తెలిసిందే.
#WATCH | Tamil Nadu Governor RN Ravi, who refused to read the address given by the government to him at the Legislative Assembly, leaves from the Assembly https://t.co/9IvBmDvMp6 pic.twitter.com/gYv8RjNmq7
— ANI (@ANI) February 12, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

