Tamil Nadus | దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది తమిళనాడువైపు దూసుకొస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. చెన్నైలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
‘మాండస్’ తుపాను హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్రంలోని 14 జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం జాతీయ విపత్తుల నివారణ బృందాలను (ఎన్డీఆర్ఎప్) రంగంలోకి దింపింది.
కాగా, తుపాను ‘మాండస్’ ఈనెల 9వ తేదీ (శుక్రవారం) రాత్రి తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం తాటుతుందని ఐఎండీ తెలిపింది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. తుపాను నేపథ్యంలో సముద్రం అలజడిగా ఉంటుందని, దక్షిణకోస్తా – తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ల కూడదని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని కోరింది.
Tamil Nadu's Chennai receives light rainfall under the influence of cyclonic storm 'Mandous' over the Bay of Bengal
It is expected to cross between Puducherry and Sriharikota with a wind speed of 70 kmph around midnight of 9th December, as per IMD. pic.twitter.com/cF9qNHsS5P
— ANI (@ANI) December 8, 2022