చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల కారణంగా పలు జిల్లాలో కుంభవృష్టి కురుస్తున్నది. దాంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు పట్టణాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పలు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. తిరుచిరాపల్లిలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు వరదలు ఉధృతమయ్యాయి. రాహదారులు నదులను తలపిస్తున్నాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు, ఈశాన్య రుతుపవనాల కారణంగా నవంబర్ 9, 10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల్లో, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Tamil Nadu | Traffic movement affected in Tiruchirappalli due to waterlogging as a result of heavy rainfall
— ANI (@ANI) November 8, 2021
Heavy rainfall expected in coastal areas of Andhra Pradesh and Tamil Nadu from 9-11th Nov due to northeast monsoon, as per IMD. pic.twitter.com/N4RdTe3bF4