శుక్రవారం 03 జూలై 2020
National - Jun 27, 2020 , 16:02:31

ఎస్ఐకి క‌రోనా పాజిటివ్.. పోలీసు స్టేష‌న్ మూసివేత‌

ఎస్ఐకి క‌రోనా పాజిటివ్.. పోలీసు స్టేష‌న్ మూసివేత‌

చెన్నై : త‌మిళ‌నాడులో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. తిర్పూర్ స‌మీపంలోని నార్త్ పోలీసు స్టేష‌న్ స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్ కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో ఆ స్టేష‌న్ ను పోలీసు ఉన్న‌తాధికారులు మూసివేశారు. స్వ‌ల్ప అనారోగ్యానికి గుర‌వ‌డంతో.. మ‌హిళా ఎస్ఐ జూన్ 24న సెలవుపై వెళ్లింది. ఆ మ‌రుస‌టి రోజు ర‌క్త న‌మూనాల‌ను ల్యాబ్ కు పంపింది. క‌రోనా ఫ‌లితాల్లో పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో 74,662 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 957 మంది ప్రాణాలు కోల్పోయారు.  

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోనూ..

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని భావ్ న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ లో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో ఆ స్టేష‌న్ ను సీజ్ చేశారు. ఈ పోలీసు స్టేష‌న్ లో ప‌ని చేస్తున్న మిగతా వారంద‌రిని హోం క్వారంటైన్ లో ఉండాల‌ని ఉన్న‌తాధికారులు ఆదేశించారు. భావ్ న‌గ‌ర్ ను పోలీసులు కంటైన్ మెంట్ జోన్ గా ప్ర‌క‌టించారు. 


logo