చెన్నై: ఒక మహిళా కాలేజ్ వద్ద విద్యార్థిని తండ్రిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని మధురైలో ఈ సంఘటన జరిగింది. అరుల్దాస్పురానికి చెందిన 50 ఏళ్ల సెంథమిల్ పాండియన్ బుధవారం సాయంత్రం మదురైలోని శ్రీ మీనాక్షి ప్రభుత్వ మహిళా ఆర్ట్స్ కళాశాలకు వద్దకు వెళ్లాడు. అక్కడ చదువుతున్న తన కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు వేచి ఉన్నాడు. కాలేజీ నుంచి విద్యార్థినులు బయటకు వస్తున్నారు.
ఇంతలో ఒక అంతిమయాత్ర ఆ కాలేజీ ముందుగా వెళ్లింది. డ్యాన్స్ చేస్తున్న యువకులు విద్యార్థినులను చూసి ఈలలు వేసి గట్టిగా అరవసాగారు. గమనించిన పాండియన్ దీనిపై వారిని నిలదీశాడు. దీంతో ఆ గ్రూప్‌లోని కొందరు వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. ఒక వ్యక్తి హెల్మెట్‌తో పాండియన్‌ను కొట్టాడు. కింద పడిన ఆయనపై పలువురు దాడి చేశారు. ఇది చూసిన కాలేజీ విద్యార్థినులు భయాందోళన చెందారు. దీంతో కాలేజీ సిబ్బంది వారిని లోపలకు పంపి గేట్ మూశారు.
మరోవైపు తనపై జరిగిన దాడిపై పోలీసులకు పాండియన్ ఫిర్యాదు చేశాడు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. కాగా, ఆ కాలేజీ గేట్ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH| TN:Some youths assaulted a parent who'd come to pick up his daughter from Sri Meenakshi Govt Arts College for Women in Madurai on Nov 2
6 people arrested so far; case filed u/s 341,308,506(ii) &TN Prohibition of Harassment of Woman Act:Madurai CP
(Note:Abusive language) pic.twitter.com/SNspntoPYN
— ANI (@ANI) November 5, 2022