శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 18:35:10

తమిళనాడులో కరోనా విలయ తాండవం

తమిళనాడులో కరోనా విలయ తాండవం

చెన్నై : తమిళనాడులో కరోనా విలయతాండవ చేస్తోంది. రోజూ వేలల్లో కేసులు నమోదు అవుతుండడంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తడిచిన 24 గంటల్లో రాష్ర్టంలో 6,785 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,99,749కి చేరింది. ఇందులో 53,132 మంది కరోనా సోకి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. నేడు 6,504 మందిని డిశ్చార్జి చేయగా మొత్తం 1,43,297మంది ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో 88 మంది కరోనాతో మృతి చెందగా ఇప్పటివరకు 3,320 మంది మరణించినట్లు రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo