శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 19:21:00

తమిళనాడులో కొత్తగా 5,679 పాజిటివ్‌ కేసులు.. 72 మరణాలు

తమిళనాడులో కొత్తగా 5,679 పాజిటివ్‌ కేసులు.. 72 మరణాలు

చెన్నై: తమిళనాడులో కరోనా తీవ్రత అదుపులోకి రావడం లేదు. వైరస్‌ కేసుల సంఖ్య 5.7 లక్షలకు చేరుతుండగా మరణాలు 9 వేలు దాటాయి. ప్రతి రోజు కొత్తగా ఐదు వేలకుపైగా వైరస్‌ కేసులు 50కి పైగా మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 5,679 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 72 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,69,370కు, మరణాల సంఖ్య 9,148కు చేరింది. గత 24 గంటల్లో 5,626 మంది కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 5,13,836 మంది కోలుకోగా ప్రస్తుతం 46,386 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి