తమిళనాడుకు చెందిన ఉదయకుమార్(28) ఓ శ్మశానంలో పనిచేస్తున్నాడు. అక్కడే ఉండేవాడు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో, చలి వాతావరణంతో అతని ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడు చనిపోయాడనుకొని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్స్పెక్టర్ రాజేశ్వరి అక్కడికి చేరుకొన్నారు. బతికే ఉన్నట్టు గుర్తించి వెంటనే ఉదయకుమార్ను తన భుజాలపై ఎత్తుకొని వాహనం దగ్గరకు మోసుకొచ్చి దవాఖానకు తరలించారు. ఈ వీడియో వైరల్ అయింది. నెటిజన్లు ఆమె సాహసాన్ని కొనియాడుతున్నారు.