Tamil Nadu | కోయంబత్తూర్, డిసెంబర్ 20 : మాజీ భార్యకు భరణం చెల్లించాలని ఆదేశించిన న్యాయమూర్తిని ఓ వ్యక్తి ఆశ్చర్యపరిచాడు. తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్(37)పై గత ఏడాది ఆయన భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. కోయంబత్తూర్ ఫ్యామిలీ కోర్టు ఈ కేసును విచారిస్తున్నది. కాగా, మధ్యంతర భరణంగా భార్యకు రూ.2 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. బుధవారం ఈ డబ్బులను చెల్లించేందుకు అతడు 20 సంచులను కోర్టుకు తీసుకొచ్చాడు. సంచుల నిండా రూపాయి, రెండు రూపాయల నాణేలు ఉన్నాయి. వీటిని చూసి ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి.. నగదు రూపంలో డబ్బులు చెల్లించాలని ఆదేశించి తిప్పి పంపించారు. గత ఏడాది జూన్‌లోనూ రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఇలానే భార్యకు రూ.55 వేల భరణాన్ని నాణేల రూపంలో ఇచ్చాడు. వీటిని అతడే లెక్కించాలనే షరతుతో కోర్టు నాణేలను అంగీకరించింది.